ప్రభుత్వ పాఠశాల ముందు క్షుద్రపూజలు - కృష్ణా జిల్లా రామన్నగూడెం
ప్రభుత్వ పాఠశాల ముందు క్షుద్రపూజలు.. చిన్నారులను భయాందోళనలకు గురిచేశాయి. కృష్ణా జిల్లా రామన్నగూడెంలో ఈ ఘటన.. పరిసర ప్రాంతాల్లో కలకలం సృష్టించింది.

black magic
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రామన్నగూడెంలోని ప్రభుత్వ పాఠశాల ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. సరిగ్గా గేటు నుంచి బడిలోపలికి వెళ్లే మార్గంలోనే జంతు బలి ఇచ్చారు. ఈ చర్యపై విద్యార్థులు, గ్రామస్తులు భయాందోళనలకు గురి అవుతున్నారు. పాఠశాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. పోలీసులు నిఘా పెట్టాలని కోరారు.