నాటుసారా తయారీ కోసం నల్లబెల్లాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని నూజివీడు పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లోని సత్యాల రాఘవరావు అనే వ్యాపారి వద్ద సుమారు 1.41 లక్షల రూపాయల విలువచేసే 2,820 కిలోల నల్లబెల్లం నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు.
నాటు సారా తయారీదారులకు నల్లబెల్లం విక్రయిస్తున్నట్లు విచారణలో వ్యాపారి రాఘవరావు ఒప్పుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. వ్యాపారి రాఘవరావును అరెస్టు చేసి.. కోర్టుకు హాజరు పరిచినట్లు డీఎస్పీ వివరించారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశానుసారం ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.