'జీఎన్‌రావు కమిటీ కాదిది... వైఎస్ జగన్ కమిటీ'
రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ లేక అధికార వికేంద్రీకరణ అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. అమరావతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలనేది భాజపా నిర్ణయమన్నారు.
bjp-vishnuvardhan-reddy-comments
అమరావతిలోనే సీడ్ కాపిటల్ ఉండాలని.. అసెంబ్లీ, సచివాలయం ఇక్కడే కొనసాగాలని భాజపా స్పష్టమైన వైఖరితో ఉందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్ధం కాని గందరగోళ పరిస్థితిలో ప్రజలు ఉన్నారని చెప్పారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కమిటీ నివేదికలున్నాయని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే ప్రాంతాలు బాగుపడతాయని చెప్పారు.
TAGGED:
పరిపాలన వికేంద్రీకరణం