ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'2 రోజుల్లో మలేషియా నుంచి రాష్ట్రానికి మెడికోల మృతదేహాలు' - bjp vice president vishnuvardhan reddy comments on malasia medicos

మలేషియాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థుల మృతదేహాలను త్వరలోనే రాష్ట్రానికి రప్పిస్తున్నట్లు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్​రెడ్డి తెలిపారు. లాక్​డౌన్​ నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్​షా, కిషన్​ రెడ్డి, సీఎం జగన్​ ఈ దిశగా చొరవ చూపారని అన్నారు.

'వైద్య విద్యార్థుల మృతదేహాలు రాష్ట్రానికి రప్పించేందుకు కృషి'
'వైద్య విద్యార్థుల మృతదేహాలు రాష్ట్రానికి రప్పించేందుకు కృషి'

By

Published : Apr 28, 2020, 1:20 PM IST

వైద్య విద్యార్థుల మృతదేహాలను రాష్ట్రానికి రప్పిస్తామన్న విష్ణువర్దన్​రెడ్డి

మలేషియాలో వైద్య విద్యను అభ్యసిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెడికోల మృతదేహాలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు మలేషియాలోని షిబు ప్రాంతంలో 25 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. లాక్​డౌన్ నేపథ్యంలో వారి మృతదేహాలను రాష్ట్రానికి తరలించడం సాధ్యం కాలేదు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని.. కేంద్ర మంత్రులు అమిత్​షా, కిషన్​రెడ్డి, ఏపీ సీఎం జగన్​ స్పందించి విద్యార్థుల మృతదేహాలు ఇక్కడకు తీసుకొచ్చేందుకు చొరవ చూపారని విష్ణువర్ధన్ పేర్కొన్నారు. బుధవారం లేదా గురువారం ఉదయానికల్లా మృతదేహాలు అనంతపురం చేరుకుంటాయని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details