ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయసాయిరెడ్డి కేసుల జాబితాను ట్విట్టర్‌లో పెట్టిన భాజాపా - విజయసాయిరెడ్డి కేసుల జాబితాను ట్విట్టర్‌లో పెట్టిన భాజాపా

ప్రభుత్వంలో జరిగే అవకతవకలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష నేతలపై బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదని భాజపా మండిపడింది. ఈ క్రమంలో ఎంపీ విజయవసాయిరెడ్డి, బాజపాకు మధ్య ట్విట్టర్​లో మాటల యుద్ధం కొనసాగుతోంది.

bjp-tweets-on-mp-vijayasai-reddy
bjp-tweets-on-mp-vijayasai-reddy

By

Published : Apr 20, 2020, 5:24 PM IST

కరోనా టెస్ట్ కిట్ల కొనుగోలు వ్యవహారంతో భారతీయ జనతా పార్టీ... వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మొదలైన ట్వీట్ల ప్రవాహం కొనసాగుతోంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైకాపా ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్ చేసిన రాష్ట్ర భాజపా... తాజాగా విజయసాయి రెడ్డిపై ఉన్న కేసుల జాబితాను ట్విట్టర్​లో ఉంచింది. కరోనా వచ్చి రాష్ట్రం ఇప్పుడు క్వారంటైన్​లో ఉంటే.... తాను చేసిన పనులతో విజయసాయి రెడ్డి 2012లోనే క్వారంటైన్​లో ఉన్నారని ట్వీట్​లో పేర్కొంది. పైత్యంతో ఉన్న కొద్ది పరువును తీసుకోకండి అన్న భాజపా.... ఇవి మీ డిగ్రీలు కాదు.. నేర ఘనతలు అంటూ....కేసుల జాబితాను ట్విటర్​లో పోస్ట్ చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details