తెలుగు సంస్కృతిని దెబ్బతీసేందుకు వైకాపా ప్రభుత్వం కంకణం కట్టుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని కేసినో ద్వారా వందల కోట్ల రూపాయలు చేతులు మారినా ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తోందని ఆరోపించారు. సంక్రాంతి పండుగ సంప్రదాయానికి వక్ర భాష్యం చెప్పేలా వైకాపా నాయకత్వం వ్యవహరిస్తోందన్నారు. మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం రూట్ మార్చిందని విమర్శించారు. సంపూర్ణ మద్యపానం నిషేధం హామీని గాలికొదిలేశారని కేవలం ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికే మద్యం అమ్మకాలను గంటపాటు పెంచారని విమర్శించారు. ఈ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. లేదంటే భాజపా ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోకుంటే... ఉద్యమం చేస్తాం: సోము వీర్రాజు - సోము వీర్రాజు వార్తలు
వైకాపా ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. తెలుగు సంస్కృతిని దెబ్బతీసేందుకు వైకాపా ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. సంపూర్ణ మద్యపానం నిషేధం హామీని గాలికొదిలేశారని.. కేవలం ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికే మద్యం అమ్మకాలను గంటపాటు పెంచారని విమర్శించారు.
Somu veerraju