తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న సోము వీర్రాజు Somu Veerraju Fires On Ycp: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. దశ, దిశా లేకుండా వైకాపా పాలన సాగిస్తోందని విమర్శించారు. జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం చేపడితే... ప్రస్తుత ప్రభుత్వం దాని నిర్మాణం ఆపేసి విశాఖపట్నం రాజధాని అనడమేంటని ప్రశ్నించారు.
తామే అమరావతిని నిర్మిస్తాం...
2024లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందన్న సోమువీర్రాజు... తామే అమరావతిని నిర్మిస్తామని అన్నారు. రూ. 10 వేల కోట్లతో అత్యద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని తెలిపారు. గతంలో రాజధాని కోసం ఖర్చు చేసిన రూ. 7,200 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులేనని పేర్కొన్నారు. కృష్ణా నదిపై ప్రత్యేకమైన వంతెనలతో పాటుగా... విజయవాడ నగరం చుట్టూ నాలుగు వరసల రహదారి నిర్మాణం చేపడతామని తెలిపారు.
ప్రశ్నిస్తే తప్పెలా అవుతుంది..
మద్యం ధరలపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని సోమువీర్రాజు పేర్కొన్నారు. పేదవారు సేవించే చీప్ లిక్కర్ రూ. 270 విక్రయించడం ఏమిటని ప్రశ్నిస్తే... తప్పు ఎలా అవుతుందని అన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న సోము వీర్రాజు..
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారిని సోము వీర్రాజుకు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు... ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సర వేళ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. దశ,దిశా లేకుండా వైకాపా పాలన సాగిస్తోంది. చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణం చేపడితే... ప్రస్తుత ప్రభుత్వం దాని నిర్మాణం ఆపేసింది. 2024లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక మేమే అమరావతిని నిర్మిస్తాం. రూ. 10 వేల కోట్లతో అత్యద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని తిరుపతమ్మ అమ్మవారి సాక్షిగా ప్రకటిస్తున్నా.- సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి:Covid Vaccine to Teenagers: రాష్ట్రవ్యాప్తంగా టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం..