కాంగ్రెస్ పార్టీ.. రాజకీయాల కోసం.. ఈ దేశ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. స్వార్థ రాజకీయ కార్యకర్తలతో ప్రపంచం ముందు దేశాన్ని తక్కువ చేసి చూపించాలనుకోవడం దేశ ద్రోహమేనన్నారు.
తక్షణం కాంగ్రెస్ పార్టీ భాధ్యత వహించి, ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీని, భాజపాని ఎదుర్కోలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని... కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నటికి క్షమించరని విష్ణువర్థన్‌రెడ్డి మండిపడ్డారు.