ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BJP Executive Meeting వైసీపీ అవినీతిపై కొనసాగుతున్న బీజేపీ చార్జిషీట్లు.. పవన్​తో పొత్తుపై అధిష్టానిదే నిర్ణయమన్న నేతలు

BJP state executive meeting: భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా గన్నవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది.. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై దశల‌వారీగా ఛార్జి‌షీట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో బీజేపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

BJP state executive meeting
BJP state executive meeting

By

Published : May 19, 2023, 9:16 PM IST

Updated : May 19, 2023, 10:52 PM IST

BJP state executive meeting: ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై దశల‌వారీగా ఛార్జి‌షీట్లు విడుదల చేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యనేతలు పాల్గొన్నారు. వైసీపీ అవినీతి, అసమర్థ పాలన తదితర అంశాల‌పై దశల‌వారీగా ఛార్జి‌షీట్లు విడుదల చేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఈ నెల 30తో ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన పూర్తి కానున్న సందర్భంగా 15 రోజులు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించామన్నారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోందని.. భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్ విమర్శించారు.

మీడియాకు వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి..అవినాష్ రెడ్డి అనుచరుల దాష్టీకాన్ని అందరూ అడ్డుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులపై అవినాష్ రెడ్డి అనుచరుల దాడి ఆయన ఖడించారు. వార్తలు రాస్తే దాడులు చేయించటం సమంజసం కాదన్నారు. మీడియా ప్రతినిధులకు వైసీపీ ప్రభుత్వ పెద్దలు క్షమాపణ చెప్పించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై ఛార్జిషీట్‌ ధాఖల చేస్తామని సోము వీర్రాజు తెలిపారు.

ప్రభుత్వ అవినీతిపై ఛార్జిషీట్‌..రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని, అన్ని రంగాల్లో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ అవినీతిపై ఛార్జిషీట్‌ వేస్తున్నట్లు పురందేశ్వరి తెలిపారు. పవన్ కల్యాణ్ పొత్తు ప్రతిపాదనలపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని పురందేశ్వరి స్పష్టం చేశారు.

కొంతమంది పత్రికా ప్రతినిధుల మీద అవినాశ్ రెడ్డి మనుషులు దుశ్చర్యలకు పాల్పడటం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీడీయా మీద వారి దాడులు సహంజంగా రాజకీయ పక్షాల మీద జరిగే దాడులుగా వారు ప్రయత్నిస్తే భారతీయ జనతా పార్టీ వెనుకంజ వేయకుండా వైసీపీ ప్రభుత్వ పెద్దలతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తుంది.- సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

పచ్చని చెట్టికు చెద పడితే ఎలా అవుతుందో ఆరకంగా జగన్ రూపంలో ఈ రాష్ట్రానికి ఒర చెద పట్టిందని.. పీడీస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఈ అవినీతి పార్టీ కబంద హస్తాల నుంచి ప్రజలకు ముక్తి కల్పించే వరకు భారతీయ జనతా పార్టీ ప్రతీ ప్లాట్​ఫామ్​లో చార్జ్​షీట్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.- సత్యకుమార్‌, భాజపా జాతీయ కార్యదర్శి

పొత్తులనేవి సాధారణంగా పైన మా నాయకులు తీసుకునే అంశం.. ఇక్కడ ప్రజల వద్దకు భారతీయ జనతా పార్టీని ఎలా తీసుకెళ్లాలి అనే దానిపై పని చేస్తున్నాం. ఇంక పొత్తుల గురించి అయితే ఎన్నికల సమయానికి పైన వారు తీసుకునే నిర్ణయం.- పురందేశ్వరి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

గన్నవరంలో బీజేపీ కార్యవర్గ సమావేశం.. వైసీపీపై ఛార్జి‌షీట్లు విడుదల

ఇవీ చదవండి:

Last Updated : May 19, 2023, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details