దేశంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించడం అభినందనీయమని భాజపా అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ అన్నారు. ప్రాంతాలు, వర్గాలు చూడకుండా కేంద్రం ఇతోధికంగా సాయం చేస్తూ అన్ని ప్రాంతాలను ఆదుకుంటుందన్నారు. కేంద్రం ఇస్తున్న చేయూతతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని సూచించారు. కర్షకులు పండించిన అన్ని పంటలను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది.... ఇలా పలువురు ఉద్యోగులు పని ఒత్తిడిలో చిన్నచిన్న తప్పులు చేసినా వాటిని పెద్ద మనసుతో క్షమించాలని అన్నారు. అంతేతప్ప వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం మంచిది కాదని గోపాలకృష్ణ సూచించారు.
'వైద్యులను తొలగించడం మంచిది కాదు' - వెలగపూడి గోపాలకృష్ణ వార్తలు
కరోనాను పట్టించుకోకుండా ప్రజా సేవలో ఉన్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు వంటి వారి విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించకూడదని భాజపా అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ అన్నారు. వారు పని ఒత్తిడిలో చిన్న తప్పులు చేసినా వాటిని పెద్ద మనసుతో క్షమించాలని సూచించారు.
bjp spokes person respond on central government package for states