చిన్నారుల పాఠ్యపుస్తకాల్లో మత ప్రచార అంశాలపై భాజపా నేత సోము వీర్రాజు విజయవాడలో ఆరోపించారు. పాఠ్యపుస్తకాల్లో కూడా మత ప్రచారానికి పూనుకొన్నారా?.. అని వీర్రాజు మండిపడ్డారు. మతప్రచారాలను చిన్నారుల పాఠ్యపుస్తకాల నుంచి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మతప్రచారాలను తొలగించకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. చిన్నారుల మెదళ్లలో మతం చొప్పించడానికి పూనుకొన్నారా? అని ఆయన ప్రశ్నించారు. మీ మతవ్యాప్తికి హద్దులు లేవా? అని ట్విట్టర్‌లో సోము వీర్రాజు ధ్వజమెత్తారు.
మతప్రచారాలను తొలగించకపోతే ప్రతిఘటనే - సోము వీర్రాజు - రాష్ట్ర ప్రభుత్వంపై సోము వీర్రాజు వ్యాఖ్యలు
చిన్నారుల పాఠ్యపుస్తకాల్లో మత ప్రచార అంశాలపై భాజపా నేత సోము వీర్రాజు విజయవాడలో మాట్లాడారు. మతప్రచార పాఠ్యాంశాలను తొలగించకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
సోము వీర్రాజు