ప్రభుత్వం విమర్శలు గుప్పించిన భాజపా జాతీయ కార్యదర్శి - bjp leader sayaprasad latest news
రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలనలో అనాలోచిత నిర్ణయాలతో అభివృద్ధి పురోగమించకపోగా ... తిరోగమనంలో సాగుతోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలనపై భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపణలు గుప్పించారు. విజయవాడలోని ఫన్ టైమ్స్ క్లబ్ లో సమావేశమైన ఆయన... ఏడాది కాలంగా రాష్ట్రంలో ప్రజా కంటక పాలన సాగిస్తున్నారని తెలిపారు. కోర్టు మెుట్టికాయలు వేస్తున్నా తప్పుల మీద తప్పులు చేస్తూ రాజ్యంగా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని సత్యకుమార్ మండిపడ్డారు. ఓ వైపు నవరత్నాల పేరుతో ఇచ్చినట్లే ఇచ్చి...మరో వైపు నుంచి లాక్కుంటున్నారని విమర్శించారు. దేవాలయాల ఆస్తులను పరీరక్షించాలన్న సత్యకుమార్... సంపద సృష్టించి మౌలిక సదుపాయాల కల్పన చేయాలి తప్ప.... అమ్మకాల పేరుతో కాదని ఎద్దేవా చేశారు.కరోనా వైరస్ ను అంతమెుందించడంలో ముందుండి పనిచేస్తున్న వైద్యులు, పారిశుద్ధ్యకార్మికులు, పోలీస్ సిబ్బందికి పీపీఈ కిట్లను అందించారు.