వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చటం వల్లే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు భయపడుతున్నాయని ఎమ్మెల్సీ, భాజపా ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ విమర్శించారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇవ్వలేదని బ్యాంకుల ముందు చెత్త వేయడం సరైన చర్య కాదన్నారు. బ్యాంకులు రుణాలు ఎందుకు ఇవ్వడం లేదో ఆలోచించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ తరహా చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వం అపహాస్య పాలవుతుందన్నారు. సంక్షేమం పేరుతో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని మాధవ్ దుయ్యబట్టారు.
సర్కార్ సరిగ్గా లేదు