కృష్ణా జిల్లా గన్నవరం గోపాల్ రావు ఠాగూర్ స్మారక సమితి, సేవా భారతి చిగురపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని రాష్ట్ర భాజపా ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్, అధ్యక్షుడు సోము వీర్రాజు సందర్శించారు. కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య, ఇతర సేవలు, సదుపాయాలను పరిశీలించి.. సంతృప్తి వ్యక్తం చేశారు.
ఖర్చు భరించడమే కాక.. ఐసోలేషన్ నిర్వహిస్తున్న పార్టీ సీనియర్ నేత కుమారస్వామిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో నేతలు నాదెండ్ల మోహన్ కుమార్, ఫణి, రవి తదితరులు పాల్గొన్నారు.