రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా భాజపా, జనసేన నేతలు కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతక్కి వేణుగోపాలరావు మాట్లాడుతూ.. అంతర్వేది, గుంటూరు, పిఠాపురం ఘటనలపై రాష్ట్రప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాక.. విజయవాడ దుర్గ ఆలయంలో వెండి సింహాలు చోరీకావడం దారుణమన్నారు. ఈ ఘటనలపై శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తంచేస్తున్న భాజపా, జనసేన, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, భక్తులపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం తగదన్నారు.
'శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నేతల అరెస్టులు దారుణం' - నూజివీడులో భాజపా నాయకుల అరెస్ట్
దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసన వ్యక్తంచేస్తున్న నేతలను, భక్తులను అరెస్ట్ చేయడం దారుణమని భాజపా నాయకులు నూతక్కి వేణుగోపాలరావు అన్నారు. ఈ విషయమై కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు.
!['శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నేతల అరెస్టులు దారుణం' bjp leaders protest infront of nuzivid police station in krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8844256-1080-8844256-1600408950663.jpg)
నూజివీడులో భాజపా నేతల నిరసన