తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్ధం కావడంపై... భక్తులు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని భాజపా నాయకులు కృష్ణా జిల్లా రాజోలులోని అంతర్వేది దేవస్థానం ముందు ధర్నాకు దిగారు.
స్వామివారి రథం ప్రమాదవశాత్తూ దగ్ధం అయ్యిందా? ఎవరైనా దుండగులు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డారా అనేది స్పష్టం కావాలన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చూసినా భాజపా తరఫున ప్రత్యక్ష పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.