ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా దిల్లీలో భాజాపా నేతల ధర్నా - భాజాపా అధికార ప్రతినిధి కిలారు దిలీప్ ధర్నా

లాక్​డౌన్​ కారణంగా పనులు లేక ఖాళీగా ఉన్న ప్రజలపై ప్రభుత్వం విద్యుత్ బిల్లుల భారం మోపడం ఏంటని భాజపా అధికార ప్రతినిధి కిలారు దిలీప్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్​లో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆయన పార్టీ నేతలతో కలిసి దిల్లీలో దీక్ష చేపట్టారు. ఆయనతో పాటు మరికొందరు భాజపా అధికార ప్రతినిధులు వారి ఇళ్లల్లో నిరసనలు తెలియజేస్తున్నారు.

bjp leaders protest against electricity bills in delihi
దిల్లీలో భాజాపానేతల ధర్నా

By

Published : May 19, 2020, 1:54 PM IST

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ భాజపా అధికార ప్రతినిధి కిలారు దిలీప్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్​మోహన్​రెడ్డి ఎక్కడ బహిరంగసభలో మాట్లాడినా... విద్యుత్ చార్జీల పెంపు పై మాట్లాడే వారని, అధికారికంగా విద్యుత్ బిల్లులు పెంచుతున్నామన్న ప్రకటన చేయకుండానే... బిల్లులు వేలకు పెంచారని ఆయన ధ్వజమెత్తారు. ఛార్జీలు పెంచనే లేదని ప్రభుత్వం వాదిస్తోందని.... మరి అంత బిల్లులు ఎందుకు వచ్చాయో చెప్పాలని అన్నారు. బిల్లుల చెల్లింపులకు కొంత గడువు ఇస్తామంటున్నారు కానీ.. ఆ బిల్లులను కరెక్ట్ చేస్తామని మాత్రం ఎందుకు చెప్పడం లేదని అన్నారు. ఏ నెలకు ఆ నెల బిల్లులు డివైడ్ చేసి ఉంటే... స్లాబ్​లు యూనిట్ ధర తక్కువ వచ్చే అవకాశం ఉండేదని అన్నారు. ఇలా బిల్లులు డివైడ్ చేయకుండా ఒకే బిల్లు ఇచ్చేయడంతో .. వినియోగదారుడు భారీ మొత్తాలను ఈ కష్టకాలంలో చెల్లించాల్సి వస్తోందని, తక్షణమే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details