కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించినకార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భాజపా రాష్ట్ర వ్యవహారాల శాఖ బాధ్యుడు సునీల్ దియోధర్... వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో గెలుపు కోసం ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి రూ. 50 కోట్లు ఖర్చు చేసి... ఇప్పుడు రూ. 500 కోట్లు సంపాదించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఆయన పాల్గొన్నారు. గత ఐదేళ్లలో రాజధాని నిర్మించకుండా.. అప్పటి ప్రభుత్వం రియల్ఎస్టేట్ వ్యాపారం చేసిందని విమర్శించారు. ఇప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తరాంధ్ర మీద ప్రేమతో కాకుండా విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని సునీల్ దియోధర్ ఆరోపించారు.
ఒక్కో ఎమ్మెల్యే రూ. 500 కోట్లు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నారు : సునీల్ దియోధర్ - bjp state president kanna laxminarayana news update
కృష్ణాజిల్లా గుడివాడలో భాజపా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు భాజపా రాష్ట్ర వ్యవహారాల శాఖ బాధ్యుడు సునీల్ దియోధర్ పాల్గొని ప్రసంగించారు.
కృష్ణాజిల్లా గుడివాడలో భాజపా కార్యకర్తల సమావేశం