BJP Leaders Fire On YSRCP: వాజ్‌పేయీ జయంతి సందర్భంగా విజయవాడ భాజపా కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జీ సునీల్ దేవ్‌ధర్ హాజరయ్యారు. వాజ్‌పేయీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాజ్‌పేయీ పరిపాలన విధానం.. నేటి పాలకులకు ఆదర్శనని సునీల్ దేవ్‌ధర్ తెలిపారు. మోదీ పాలనలో వర్సిటీలు, వైద్య కళాశాలలు చాలా వచ్చాయన్నారు.
Sunil Deodhar on YSRCP: ఏపీలో ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా పాలన సాగుతోందన్న సునీల్ దేవ్‌ధర్.. హోంమంత్రి సుచరిత మతపరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వైకాపా నేతలు మాయమాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని సునీల్ దేవ్‌ధర్ ఆరోపించారు. అలాగే బలవంతపు మతమార్పిడులను పాలకులే ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. హిందూ ఆలయాల ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని.. ఏపీలో భాజపా అధికారంలోకి వస్తే మత మార్పిడులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకువస్తామని స్పష్టం చేశారు.