ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాద ఘటనపై భాజపా నేతల దిగ్భ్రాంతి - news on fire accident at vijayawada

విజయవాడ కొవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాద ఘటనపై భాజపా నేతల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘటనా స్థలిని పరిశీలించారు. కరోనా చికిత్స పొందుతున్న వారు అగ్నిప్రమాదం భారిన పడటం చాలా బాధాకరమని భాజపా నేత ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

bjp leaders condolence on accidneta at vijayawada
కొవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాద ఘటనపై భాజపా నేతల దిగ్భ్రాంతి

By

Published : Aug 9, 2020, 1:49 PM IST

విజయవాడ అగ్నిప్రమాదస్థలిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పరిశీలించారు. అగ్నిప్రమాదం కలచివేసిందని.. చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ సెంటర్లుగా మారిన హోటళ్లను తనిఖీ చేయాలని సోము వీర్రాజు కోరారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందంతో మాట్లాడి.. సోము వీర్రాజు అక్కడి పరిస్థితి తెలుసుకున్నారు. కరోనా రోగులను కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సోము వీర్రాజు అభినందనలు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సేవలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సోము వీర్రాజు అన్నారు.

అగ్ని ప్రమాద ఘటన పై భాజపా నేత ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‪కరోనా చికిత్స పొందుతున్న వారు అగ్నిప్రమాదం భారిన పడటం చాలా బాధాకరమని అన్నారు. ‪ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ‪గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 11కుచేరిన మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details