BJP Leader Sunil Deodhar: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించటంలో వైకాపా, తెదేపా పూర్తిగా విఫలమయ్యాయని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన ఆయన.. తెదేపా, వైకాపా పాలన వైఫల్యాలపై మండిపడ్డారు.
చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపించి ఒక్క ఛాన్స్ అన్న జగన్కు బ్రహ్మరథం పడితే.. దాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో జగన్ ఉన్నారన్నారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ వ్యతిరేకతే 2024 ఎన్నికల్లో భాజపాకు అధికారం ఇవ్వనుందని జోస్యం చెప్పారు. వైకాపా ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఈ నెల 28న విజయవాడలో ప్రజాగ్రహ సభ నిర్వహిస్తున్నామన్నారు. సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.