ఏడేళ్ల పాలనలో ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. "సబ్ కా సాథ్-సబ్ కా వికాస్-సబ్ కా విశ్వాస్" లక్ష్యంగా మోదీ పాలన అందించారని తెలిపారు. ప్రధానిగా మోదీ ఏడేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా... గుంటూరులో సేవా హీ సంఘటన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పాల్గొన్నారు. మోదీ పాలనలో వ్యవసాయ, పారిశ్రామిక రంగానూల్లోనూ దేశం ముందడుగు వేసిందని, కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు మోదీ అండగా నిలిచారని కన్నా ప్రశంసించారు.
మోదీ పాలనలో దేశం ముందడుగు వేసింది : కన్నా లక్ష్మీనారాయణ - guntur latest news
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం ముందడుగు వేసిందని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రధానిగా మోదీ ఏడేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరులో సేవా హీ సంఘటన కార్యక్రమాన్ని నిర్వహించారు.
భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ