బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రతిపాదించకపోవటం బాధకరమని భాజాపా థార్మిక సెల్ కన్వీనర్ చైతన్య శర్మ తెలిపారు. ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు ఇస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని విస్మరించి, మాట తప్పి మడమ తిప్పి బ్రాహ్మణ సామాజిక వర్గం గొంతు కోశారన్నారు. బడ్జెట్లో కనీసం బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్న మల్లాది విష్ణు కనీసం కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేయించుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్చకులకు రూ. 5 వేల ఆర్థిక సాయం అన్నారని... కనీసం 10వేల మందికి కూడా కూడా ఇవ్వలేదనన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విష్ణు లాంటి అసమర్థులు ఉండడం బ్రాహ్మణుల దౌర్భాగ్యమని మండిపడ్డారు. వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
'బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆయన ఉండటం మా దౌర్భాగ్యం' - ఏపీ బడ్జెట్ వార్తలు
బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రతిపాదించకపోవటం బాధకరమని భాజాపా థార్మిక సెల్ కన్వీనర్ చైతన్య శర్మ తెలిపారు. ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తోందని విజయవాడలో ఆయన అన్నారు.
భాజాపా ధార్మిక సెల్ నాయకుల సమావేశం