ప్రీ ప్రైమరీ(పూర్వ ప్రాథమిక స్థాయి) వరకే తెలుగు బోధించాలన్న రాష్ట ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. తెలుగు భాషకు రాష్ట్రంలో అవమానం జరుగుతోందని మండిపడ్డారు. భాజపా ఆధ్వర్యంలో తెలుగు ఖ్యాతి పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలుగు భాష పట్ల ప్రభుత్వ నిర్ణయంపై భాజపా మండిపాటు - తెలుగు ఖ్యాతి
పూర్వ ప్రాథమిక స్థాయి(3-6 ఏళ్లు) వరకే తెలుగు బోధించాలన్న రాష్ట ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. తెలుగు భాషపై రాష్ట ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు.
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గ్రంథాలయాన్ని ప్రారంభించడంతోపాటు ఆరోగ్య స్వయం సేవకులతో కరపత్రాలను ఆవిష్కరించారు. ఆరోగ్య స్వయం సేవకుల ద్వారా కరోనా మూడో దశ హెచ్చరికల తరుణంలో జాగ్రత్తలను ప్రజలకు వివరింపజేస్తామన్నారు. ఇందుకోసం గ్రామానికి ఇద్దరు చొప్పున.. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మందిని ఆరోగ్య స్వయం సేవకులుగా ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కరోనా జాగ్రత్తలను 25లక్షల కరపత్రాలతో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి..'