భారత్-చైనా సరిహద్దు గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘటనను భాజపా, ఆర్ఎస్ఎస్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైనా వస్తువులను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు సంతాపం తెలిపారు.
గాల్వన్ ఘటనను ఖండించిన భాజపా, ఆర్ఎస్ఎస్ సభ్యులు - విజయవాడలో ధర్నా
గాల్వన్ లోయలో జరిగిన ఘటనపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చైనా సైనికుల ఘటనను భాజపా, ఆర్ఎస్ఎస్ సభ్యులు తీవ్రంగా ఖండించారు.
గాల్వన్ ఘటనను ఖండించిన భాజపా, ఆర్ఎస్ఎస్ సభ్యులు