కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో నిర్మించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ, జనసేన నేతలు విజయవాడలో నిరసనకు దిగారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించకపోవటాన్ని ఇరు పార్టీల నేతలు తప్పుబట్టారు. ఇళ్ల స్థలాల పేరిట వైకాపా భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
'ఇళ్ల స్థలాల కొనుగోలులో వైకాపా భారీగా అవినీతికి పాల్పడింది' - భాజపా జనసేన నిరసన వార్తలు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లను తక్షణమే పేదలకు కేటాయించాలని భాజపా, జనసేన నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పేరిట వైకాపా ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని నేతలు ఆరోపించారు.
భాజపా జనసేన నేతల నిరసన
పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం గత ఆరేళ్లలో 11 లక్షల ఇళ్లను రాష్ట్రానికి కేటాయించిందన్నారు. కానీ ఇంతవరకు పేదలకు ఇళ్లు అందించకుండా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. జీ ప్లస్ త్రీ, సగం నిర్మాణమైన ఇళ్లను తక్షణమే పేద, మధ్య తరగతి వారికి కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇళ్లను