ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని భాజపా, జనసేన నిరసన - నందిగామ తాజా వార్తలు

రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని... భాజపా, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో ఇరు పార్టీల నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.

bjp and janasena followers protest at nandigama to repair roads
రోడ్ల మరమ్మతులు చేపట్టాలని భాజపా, జనసేన నాయకుల నిరసన

By

Published : Dec 5, 2020, 1:40 PM IST

Updated : Dec 5, 2020, 6:42 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో భాజపా, జనసేన ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారులను వెంటనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నందిగామ నుంచి రామన్నపేటకు వెళ్లే రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

రహదారుల మరమ్మతులకు, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో వెంటనే పనులు చేపట్టాలని ఇరు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మైలవరంలో

మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో పోలీసులకు, బీజేపీ నాయకులకు మద్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారి తీసింది. వెల్వడం గ్రామంలో భాజపా నాయకులు రహదారులను పరిశీలించి నిరసన తెలుపుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలకూ మధ్య వాగ్వాదం జరిగింది‌. అధికారులు రోడ్ల మరమ్మతులు చేపట్టాలని భాజపా నేత నూతలపాటి బాల డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'జనసేన అంటే ఎందుకంత భయం?'

Last Updated : Dec 5, 2020, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details