ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కౌన్సిలింగ్​కు అమ్మనాన్నలు..స్టేషన్​లోనే కుమారుడి పుట్టినరోజు - దిశా మహిళా పోలీస్ స్టేషన్​ పుట్టినరోజు వేడుకలు

భార్యాభర్తలిద్దరూ తరచూ గొవడపడుతున్నారు. దీంతో వారిపై కృష్ణా జిల్లా మచిలీపట్నం దిశా పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. కౌన్సిలింగ్ నిమిత్తం సోమవారం పోలీస్ స్టేషన్​కు వచ్చారు. కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వెళ్లి వేడుకలు జరుపుకునేందుకు అనుమతివ్వమని పోలీసులను వేడుకున్నారు. ఇందుకు అంగీకరించని పోలీసులు..వేడుకులను స్టేషన్​లోనే నిర్వహించారు.

పుట్టినరోజు వేడుకలు
స్టేషన్​లో పుట్టినరోజు వేడుకలు

By

Published : Aug 2, 2021, 10:54 PM IST

కౌన్సిలింగ్ కోసం వచ్చిన భార్యాభర్తలు.. కుమారుడి పుట్టినరోజు వేడుకలను కృష్ణా జిల్లా మచిలీపట్నం దిశా పోలీస్​ స్టేషన్​లో నిర్వహించారు. కుటుంబంలో నెలకొన్న మనస్పర్థల కారణంగా గొడవపడటంతో దిశా మహిళా పోలీస్ స్టేషన్​లో వీరిపై కేసు నమోదు అయ్యింది. కౌన్సిలింగ్ నిమిత్తం సోమవారం పోలీస్ స్టేషన్​కు వచ్చారు. అయితే నేడు వారి కుమారుడి పుట్టినరోజు కావడంతో తల్లిదండ్రులిద్దరూ ఇంటికి వెళ్లి వేడుకలు జరుపుకుంటామని పోలీసులకు చెప్పారు. ఇందుకు పోలీసులు అంగీకరించలేదు.

దిశా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజీవ్ కుమార్ చొరవ తీసుకుని ఆ బాలుడికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కేక్ కట్ చేయించారు. పోలీస్ సిబ్బంది సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించారు. కుటుంబంలో నెలకొన్న చిన్నచిన్న గొడవలకు పసిపిల్లల మనసుల్లో విషబీజాలు మొలకెత్తనివ్వద్దని, మీ గొడవలు అన్నింటిని మరిచి మీ పిల్లలతో సంతోషంగా గడపాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details