దొంగలు అరెస్ట్... పది వాహనాలు స్వాధీనం - nandigama
నందిగామ ప్రాంతంలో కొన్నిరోజులుగా ద్విచక్రవాహనాలు మాయమవుతున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు.
కృష్ణా జిల్లా నందిగామలో ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు నాలుగున్నర లక్షల రూపాయల విలువైన 10 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నందిగామ ప్రాంతంలో కొద్దిరోజులుగా ద్విచక్రవాహనాల దొంగతనాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో వారిచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణలోనూ మరో ఆరు బైకులను వీరు దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు నందిగామ డీఎస్పీ తెలిపారు.