విజయవాడతో పాటు జిల్లాలోని వీరవల్లి, హైదరాబాద్‌లలో ద్విచక్రవాహనాలను దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు నగర పోలీసులు తెలిపారు. జిల్లాలోని ఉయ్యూరు మండలం మంటాడకు చెందిన సాయిశేఖర్.. గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రవితేజనాయక్ అనే వ్యక్తికి ఈ వాహనాలు చేరవేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించవచ్చన్న ఉద్దేశంతో సాయిశేఖర్ ఈ దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నాడని సీపీ శ్రీనివాసులు తెలిపారు. 29 నేరాలు చేసి జైలుకు వెళ్లాడని, గతేడాది జూలైలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలై నేర ప్రవృత్తిని వదలకుండా చోరీలకు పాల్పడుతున్నాడని సీపీ వెల్లడించారు.
జల్సాలకు అలవాటుపడి దొంగగా మారాడు: సీపీ శ్రీనివాసులు - విజయవాడ క్రైం న్యూస్
ద్విచక్రవాహనాల దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని విజయవాడ నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 31 ద్విచక్రవాహనాలు, ఒక టాటాఏస్ గూడ్స్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని కమిషనర్ బి.శ్రీనివాసులు వెల్లడించారు.
![జల్సాలకు అలవాటుపడి దొంగగా మారాడు: సీపీ శ్రీనివాసులు bikes thefted interstate theft arrested in vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10896104-777-10896104-1615027981775.jpg)
జల్సాలకు అలవాటుపడి దొంగగా మారాడు : సీపీ శ్రీనివాసులు
జల్సాలకు అలవాటుపడి దొంగగా మారాడు : సీపీ శ్రీనివాసులు
ఇదీచదవండి.