ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైకు దొంగల ముఠా అరెస్ట్.. - gannavaram police

బైకులు, కార్లు దొంగిలించే ముఠాను కృష్ణాజిల్లా గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఖరీదైన వాహనాలు స్వాధీనపరుచుకున్నారు.

bike thiefs were arrested by gannavaram police at krishna district

By

Published : Jul 31, 2019, 2:21 PM IST


ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను కృష్ణాజిల్లా గన్నవరం పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 3 లక్షల 60 వేలు విలువచేసే 3 కార్లు, 3ఖరీదైన ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరంలో 3 కార్లు, విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డ్యూక్ స్పోర్ట్స్ బైక్, బుల్లెట్, గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఒక గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారు. ఈ వాహనాలు దొంగిలించే ముగ్గురు సభ్యులు ఏలూరుకు చెందిన పితాని సాయిరాం, శేగు ఉమేష్ చంద్ర, ఆకుల సాయి మణితేజగా గుర్తించారు. అనంతరం వీరిని కోర్టుకు తరలించారు.

బైకు దొంగల ముఠా అరెస్ట్..

ABOUT THE AUTHOR

...view details