ఖాకీలంటే విధి నిర్వహణలో కఠినంగా ఉండే వారే కాదు.. తమలో మానవత్వం కూడా ఉంటుందని నిరూపించారు అవనిగడ్డ సీఐ బీమేశ్వర రవికుమార్. అవనిగడ్డ- కోడూరు ప్రధాన రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. బైక్ నడిపే వాహనచోదకులు రక్తపు మడుగులో రోడ్డుపై పడివున్నారు. వీరిని చూసిన స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి సరిపెట్టుకున్నారు తప్ప ఎవ్వరూ ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో ఓ పనిమీద అటుగా వెళ్తున్న సీఐ చూసి… పరిస్థితిని అర్థం చేసుకుని బాధితులను స్వయంగా తన జీపులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యం కావడం వల్ల ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
క్షతగాత్రులను స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన సీఐ - అవనిగడ్డ సీఐ తాజా వార్తలు
అవనిగడ్డ-కోడూరు ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలో అటుగా వెళ్తున్న అవనిగడ్డ సీఐ బీమేశ్వర రవికుమార్.. రక్తపు మడుగులో పడి ఉన్న క్షతగాత్రులను గమనించారు. ఆలస్యం చేయకుండా ఆయన వాహనంలో ఎక్కించుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్తున్న అవనిగడ్డ సీఐ