విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. గత 43 ఏళ్ల నుంచి ఈ దీక్షలు కొనసాగుతుండగా ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మహిళలు, పురుషులు తేడా లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు భవానీ దీక్షల కోసం మాలదారణ చేస్తున్నారు. మండల, అర్ధమండల దీక్షలు చేస్తున్న వారి సంఖ్య పది లక్షల నుంచి పన్నెండు లక్షల మంది వరకు ఉంటోంది. ఇవాళ్టి నుంచి ఈనెల 30 వరకు మండల దీక్షలు... డిసెంబరు 15 నుంచి 19 వరకూ అర్థ మండల దీక్షల మాలధారణ తేదీలుగా ప్రకటించారు.
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం - ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి మెుదలైన మండల దీక్షలు ఈ నెల 30 వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జనవరి 5 నుంచి 9 వ తారీఖు వరకూ భవాని మాల విరమణ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం
కరోనా కారణంగా ఈ సంఖ్య కొంత తగ్గే అవకాశముందని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి, అధికారులు అంచనా వేస్తున్నారు. మహామండపంలోని ఆరో అంతస్థులో భవాని దీక్షాపరుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జనవరి 5నుంచి 9వ తారీఖు వరకూ భవాని దీక్ష మాల విరమణ కార్యక్రమం నిర్వహిస్తారు. భవానీదీక్ష విరమణకు వచ్చే భక్తులు ఆన్‌లైన్‌లోనే ముందుగా టోకెన్లు తీసుకోవాలని పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు తెలిపారు.
ఇదీ చదవండి