కృష్ణాజిల్లా అవనిగడ్డలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున్న సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. తిండైనా పెట్టండి..ఇసుకైనా ఇవ్వండి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసుకుంటూ అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు వినతిపత్రం అందించారు. అనంతరం తహశీల్ధార్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడ ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.వి.గోపాలరావు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా ఇసుక లేక జిల్లాలో వేలాదిమంది కార్మికులు అర్థాకలితో అలమటిస్తున్నారని, ఒకపక్క పిల్లల స్కూల్ ఫీజులు, మరోపక్క అప్పులు కలిసి కార్మికులకు భారంగా మారాయని, రైతుల ఆత్మహత్యల వలే ... తాము ఆత్మహత్యలు చేసుకునే విధంగా జగన్ ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన విమర్శించారు. కొత్త ప్రభత్వం నూతన ఇసుక పాలసీ కూడా ప్రజలకు చేరువగా లేదని అన్నారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేయాల్సిన ఇసుకను నేడు కొంతమంది బ్లాక్ మార్కెట్ లో అధిక రేట్లకు అమ్ముతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇసుక పాలసీని అమలు చేయాలని పేర్కొన్నారు.
"పనైనా కల్పించండి..లేదా తిండైనా పెట్టండి" - తిండైనా పెట్టండి... ఇసుకైనా ఇవ్వండి
పనైనా కల్పించండి..లేదా తిండైనా పెట్టండి అనే నినాదంతో భవన నిర్మాణ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో వందలాది మంది నిర్మాణ రంగ కార్మికులు అవనిగడ్డ తహశీల్ధార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
!["పనైనా కల్పించండి..లేదా తిండైనా పెట్టండి"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4680506-260-4680506-1570454734948.jpg)
"పనైనా కల్పించండి- లేదా- తిండైనా పెట్టండి"