విజయవాడలో భారతీయ కిసాన్ సంఘ్, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం, సేవా భారతి సంయుక్తంగా కొవిడ్ రోగులకు, సహాయకులకు, వైద్య సిబ్బందికి పండ్ల రసాలు పంపిణీ చేశారు.
నిత్యం ప్రభుత్వ వైద్యశాలల్లో వీటిని పంపిణీ చేస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి సభ్యులు కుమార స్వామి, ఆర్ఎస్ఎస్ నగర కార్యనిర్వహకులు రాము, ఎబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.