Bharatamuni natyostavam: కృష్ణా జిల్లా కూచిపూడిలో జరుగుతున్న భరతముని నాట్యోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా.. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ మొదలైన నృత్యరూపకాలను కళాకారులు ప్రదర్శించారు. ఆరు రోజుల పాటు కళా ప్రదర్శనలు కొనసాగాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత పసుమర్తి రామలింగ శాస్త్రి శిష్య బృందం ప్రదర్శించిన రామకథాసారం.. నృత్యరూపకం ప్రేక్షకులను అలరించింది.
రామకథా సారానికి డీ.ఎస్.వీ శాస్త్రి దర్శకత్వం వహించగా, పసుమర్తి వారు నట్టువాంగం అందించారు. హైదరాబాద్‌కు చెందిన పీ.బీ.వైష్ణవి.. దివంగత నాట్యాచారిణీ శోభానాయుడు దర్శకత్వం వహించిన బాల కనకమయ చేల అనే అంశాన్ని ప్రదర్శించింది. వేదాంతం రాధేశ్యాం నాట్య ప్రదర్శనలు చేసిన కళాకారులను నాట్యాచారులు సత్కరించారు.