ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేరుకు యాచకుడు... దాతృత్వంలో ధనికుడు - విరాళమిచ్చిన యాచకుడు

పేరుకు మాత్రం యాచకుడు కానీ అతడి మనసు మాత్రం చాలా గొప్పది. భగవంతుని సన్నిధికి వచ్చే భక్తులు ఇచ్చే డబ్బుతో జీవనం సాగిస్తూ... తనకొచ్చిన కొంత మొత్తంలో తిరిగి ఆ భగవంతునికే ఆభరణాలు చేయించి దాతృత్వం చాటుకున్న వ్యక్తి. ఆకలి తట్టుకోలేక యాచక వృత్తి చేపట్టి అనేక మంది ఆకలి తీర్చిన సేవామూర్తి. మరి అతని గురించి మనమూ తెలుసుకుందామా..!

పేరుకు యాచకుడు... దాతృత్వంలో ధనికుడు
పేరుకు యాచకుడు... దాతృత్వంలో ధనికుడు

By

Published : Feb 13, 2020, 6:37 PM IST

యాచక వృత్తిలో సంపాదించిన సొమ్మును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న వ్యక్తి

యాచక వృత్తిని జీవనోపాధిగా చేసుకొని జీవిస్తూ... భగవంతుడికి ఆభరణాలు చేయించి దాతృత్వం చాటుకున్నాడు ఓ వ్యక్తి. విజయవాడ ముత్యాలంపాడులోని శ్రీ శిరిడి సాయి బాబా ఆలయం ఎదుట తెలంగాణకు చెందిన యాదిరెడ్డి అనే వ్యక్తి యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. అక్కడికి వచ్చే భక్తులు తనకు ఇచ్చే మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ తన దాతృత్వం చాటుకుంటున్నాడు. ఇటీవల శ్రీ దత్తాత్రేయ స్వామికి వెండి కిరీటం ఆభరణాలు చేయించాడు. నిత్యాన్నదాన పథకానికి విరాళాలు సేకరించడం, ఆలయ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం చేస్తూ... ఎంతోమందికి తన వంతు సాయం చేస్తున్నాడు. ఇటీవల ఆలయ ప్రాంగణంలో గోశాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందజేశాడు. యాచక వృత్తితో జీవనం సాగిస్తూ... తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం గొప్ప విషయమని ఆలయ ట్రస్టు ఛైర్మన్ గౌతంరెడ్డి.. యాదిరెడ్డిని కొనియాడారు. ప్రతి ఒక్కరూ 'మానవసేవే-మాధవసేవ'గా భావించి ఎంతో కొంత ఇతరులకు సాయపడాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details