ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయానికి 3 గంటలు సరఫరా నిలిపివేత - విద్యుత్ కోత వార్తలు

మోపిదేవి మండలంలో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ కారణంగా.. వ్యవసాయానికి 3 గంటలు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ నిలుపుదల చేసే సమయంలో ముందుగా తెలియజేస్తే తమకు సౌకర్యంగా ఉంటుందని రైతులు చెప్పారు.

krishna distrct
వ్యవసాయానికి 3 గంటలు విధ్యుత్ సరఫరా నిలిపివేత...

By

Published : May 14, 2020, 1:49 PM IST

కృష్ణాజిల్లా, మోపిదేవి మండలంలో వ్యవసాయానికి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ కోతలు విధించారు. మూడు గంటలు ఎమర్జన్సీ లోడ్ రిలీఫ్ వలన విధ్యుత్ నిలిపివేసిన కారణంగా.. అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా 9 గంటలు సమయం వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

ఈ కారణంగా.. కొందరు రైతులు కంద మొక్కలకు నీరు పెట్టడానికి కులీలను పెట్టుకోగా మరికొందరు రైతులు ఇతర పంటలకు ఎరువులు వేసుకున్నారు. ఎంతసేపు చూసనా కరెంటు రాక పని లేక కూలీలు వెళ్ళిపోయారు. మోపిదేవి మండలంలో వేల సంఖ్యలో వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ నిలుపుదల చేసే సమయంలో ముందుగా తెలియజేయాలని.. కనీసం పోన్లకు మెస్సేజ్ ద్వారా అయినా తెలియజేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details