జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమవ్వాలని జాయింట్ కలెక్టర్ శివశంకర్ సూచించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య, ఔషధ నియంత్రణ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 20 బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. బాధితులకు చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఔషధాలను త్వరగా తెప్పించనున్నట్లు తెలిపారు. గర్భిణులకు కరోనా వస్తే వైద్య చికిత్స అందిస్తున్నామని.. వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని జేసీ తెలిపారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో గర్భిణులకు డెలివరీ, కరోనా చికిత్సలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని వివరించారు. కరోనా వార్డుల్లో చికిత్స అందించే వైద్యులు తప్పనిసరిగా వివరాలను నమోదు చేయాలని కోరారు.
బ్లాక్ ఫంగస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జేసీ - black fungus effect on Krishna District
బ్లాక్ ఫంగస్ కేసుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ శివశంకర్ సూచించారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 20 బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య, ఔషధ నియంత్రణ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
బ్లాక్ ఫంగస్