బంగారపు గొలుసు చోరీ చేశారనే అనుమానంతో.. ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి హింసించారని, ఈ ఘటనకు కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. నందిగామ డీఎస్పీ కార్యాలయం వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్పందించిన డీఎస్పీ.. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అసలేం జరిగిందంటే..?
నందిగామకు చెందిన ఇద్దరు మహిళలు రోల్డ్ గోల్డ్ వస్తువులు విక్రయించేందుకు చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి వెళ్లారు. గ్రామంలోని ఓ ఇంట్లోని వాళ్లకు రోల్డ్ గోల్డ్ వస్తువులు చూపించి కొనుగోలు చేయాలని కోరారు. ఆ తర్వాత సదరు మహిళలు తమ దారిన తాము వెళ్లిపోయారు. అయితే.. ఆ ఇంట్లో ఉన్న బంగారం గొలుసు ఒకటి కనిపించట్లేదని, రోల్డ్ గోల్డ్ వస్తువులు అమ్ముకోవటానికి వచ్చిన వారే తీసి ఉంటారని ఆ ఇంటి కుటుంబసభ్యులు అనుమానించారు.