రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తైంది. వీరి పేర్లను రాష్ట్రప్రభుత్వం బుధవారం ప్రకటించనుంది. 30 వేలకు పైగా జనాభా ఉన్నవాందరికీ ఓ కార్పొరేషన్ చొప్పున... మొత్తం 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటిలో వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త ,ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలూ ఉన్నాయి.
29 మంది మహిళలు, 27 మంది పురుషులకు ఛైర్మన్ పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించిన మేరకు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. డైరెక్టర్ల పదవుల్లో మహిళలకు యాభై శాతం పదవులు ఇవ్వాలని తీర్మానించారు. ఈ కేటాయింపుల్లో అన్ని జిల్లాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.