ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

R.KRISHNAIAH: డిమాండ్ల సాధన కోసం జాతీయ స్థాయి ఉద్యమం: ఆర్ కృష్ణయ్య - విజయవాడ ప్రధాన వార్తలు

కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో బీసీ కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఈ మేరకు తీర్మానాలు చేయడం సహా... పోరాట కార్యాచరణ రూపొందించారు.

మాట్లాడుతున్న ఆర్ కృష్ణయ్య
మాట్లాడుతున్న ఆర్ కృష్ణయ్య

By

Published : Sep 12, 2021, 5:09 PM IST

కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో బీసీ కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమెంట్​లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం జాతీయ స్థాయి ఉద్యమం చేయనున్నట్లు ప్రకటించారు. విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి.. ఈ మేరకు తీర్మానాలు చేయడం సహా... పోరాట కార్యాచరణ రూపొందించారు. కులగణన విషయంలో భాజపా వైఖరి స్పష్టం చేయాలన్నారు.

బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇప్పటికే పార్లమెంట్​లో వైకాపా బిల్లు పెట్టిందని పలు పార్టీలు మద్దతిచ్చాయని ఆర్​. కృష్ణయ్య తెలిపారు. బిల్లును ఆమోదించేందుకు భాజపా సహా అన్ని పార్టీలు ముందుకు రావాలన్నారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, దీనికోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

సీజేఐ ఆగ్రహంతో కదిలిన కేంద్రం- ట్రైబ్యునళ్లకు సభ్యుల నియామకం

ABOUT THE AUTHOR

...view details