సీఎం జగన్ దిల్లీ పర్యటన వివరాలను ప్రజలకు తెలపాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. అమిత్ షాను జగన్ ఎందుకు కలిశారో, ఏఏ అంశాలు చర్చించారో మీడియాకు వెల్లడించాలన్నారు. రాష్ట్రప్రయోజనాలు, ప్రత్యేకహోదా, ఇతర అంశాల కోసం ఆయన కేంద్రమంత్రులను కలిశారా... లేక తన స్వప్రయోజనాల కోసమా సమావేశమయ్యారా అని ప్రశ్నించారు.
' దిల్లీలో ఏం చేశారో చెప్పండి... ప్రభుత్వానికి తెదేపా డిమాండ్' - బండరు సత్యనారాయణపై వార్తలు
సీఎం జగన్ దిల్లీ పర్యటన వివరాలను ప్రజలకు తెలియజేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. కేంద్రమంత్రి అమిత్ షాతో ఏఏ అంశాలు చర్చించారో వెల్లడించాలన్నారు.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ
ప్రభుత్వం శారదాపీఠం స్వామీజీకి కల్పించిన భద్రతే... ఇతర మఠాధిపతులు, స్వామీజీలకు కల్పించాలని కోరారు. హిందూ మతం కోసం పోరాడుతున్న స్వామీజీలు, మఠాధిపతులను అధికార పార్టీ ఎమ్మెల్యేలే బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: సత్రాల భవన నిర్మాణానికి సీఎంలు జగన్, యడియూరప్ప భూమిపూజ
TAGGED:
బండరు సత్యనారాయణపై వార్తలు