ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ వెబ్‌సైట్లను నిషేధించాలి' - ఆన్​లైన్ రమ్మీ వెబ్​సైట్లు వార్తలు

ఆన్​లైన్ రమ్మీ యువతను పక్కదారి పట్టిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సంబంధిత వెబ్​సైట్లను రాష్ట్రంలో నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేశారు.

ban online rummy websites in state, cpi ramakrishna letter to cm jagan
ban online rummy websites in state, cpi ramakrishna letter to cm jagan

By

Published : Jun 5, 2020, 7:50 AM IST

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ వెబ్‌సైట్లను నిషేధించాలని ముఖ్యమంత్రి జగన్​కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఆన్‌లైన్‌ రమ్మీ వల్ల యువత ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ రమ్మీలో జాాయిన్‌ కావాలంటే బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని.... యువత పాన్‌కార్డు, అడ్రస్‌ ప్రూఫ్‌ సహా వివరాలన్నీ ఇస్తున్నారని రామకృష్ణ వివరించారు. దీనివల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. నూజివీడు పీఎన్‌బీ ఉద్యోగి రమ్మీకి బానిసై ఖాతాదారుల సొమ్ము కొల్లగొట్టిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఆన్‌లైన్‌ రమ్మీని ఇప్పటికే తెలంగాణ, హరియాణా, మణిపూర్‌లో నిషేధించారని గుర్తు చేశారు. మోసాల బారిన పడకుండా యువతకు కౌన్సిలింగ్ కేంద్రాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రామకృష్ణ కోరారు.

ABOUT THE AUTHOR

...view details