ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అబ్బురపరిచిన  అమరావతి బాలోత్సవం-2019 - amaravati balotsav-2019

విజయవాడలో ఎస్ఆర్ఆర్& సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అమరావతి బాలోత్సవం-2019 ప్రదర్శన ఘనంగా ముగిసింది.

విజ్ఞాన ప్రదర్శన

By

Published : Sep 1, 2019, 5:42 AM IST

విజయవాడలో అమరావతి బాలోత్సవం-2019 విజ్ఞాన ప్రదర్శనకు అధిక స్పందన వచ్చింది. పోటీల్లో వందల మంది విద్యార్థుల ఆవిష్కరణలు అబ్బురపరిచాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రాజెక్ట్‌లతో తరలివచ్చారు. సుమారు 300కు పైగా నమూనాలతో కళాశాల ప్రాంగణం నిండిపోయింది. నూతన ఆలోచనలకు ఆధునిక సాంకేతికతను జోడించి అబ్బుర పరిచే ఆవిష్కరణలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సాంకేతిక పరిష్కారం, నదీ ప్రక్షాళనకు నూతన పద్ధతులు, సౌర విద్యుత్తుతో అద్భుతాలు సృష్టించే ఆలోచనలు, డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంతో ప్రయోజనాలు.... ఇలా అనేక ఆవిష్కరణలతో ఔరా అనిపించారు.

అబ్బురపరిచిన అమరావతి బాలోత్సవం-2019

ABOUT THE AUTHOR

...view details