ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అంబేడ్కర్ సైతం మనస్థాపానికి గురయ్యేలా ఉంది పరిస్థితి' - bala veeranjneya swamy on home minister

రాష్ట్ర హోంమంత్రిపై తెదేపా నేత బాలవీరాంజనేయ స్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళితులపై దాడులు జరుగుతున్నా.. సుచరిత పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

bala veeranjaneeya swamy
బాలవీరాంజనేయ స్వామి

By

Published : Jul 22, 2020, 11:10 PM IST

రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా హోం మంత్రి మౌనవ్రతం చేయడం బాధాకరమని తెదేపా నేత బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. తనకేమీ సంబంధం లేదన్నట్లుగా హోం మంత్రి సుచరిత ప్రవర్తన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సామాజికవర్గ మెప్పు కోసం దళిత జాతికి అన్యాయం చేయొద్దని హితువు పలికారు. దళితులపై ఇన్ని దాడులు జరుగుతున్నా హోంమంత్రి స్పందన లేకపోవడంతో.. ఇదేనా నేను రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసే విధానం అని అంబేడ్కర్ సైతం మనస్థాపానికి గురయ్యేలా పరిస్థితి ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details