కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఉమా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు. హైకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసినా బుధవారం రాత్రికి ఆ పత్రాలు కారాగారం అధికారులకు సమర్పించకపోవడంతో ఉమా విడుదల వాయిదా పడింది. గురువారం ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. కొండపల్లి అభయారణ్యం ప్రాంతంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో జి.కొండూరు పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, బెయిలు మంజూరు చేయాలని కోరుతూ దేవినేని ఉమా హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిగింది. రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారని, సీఆర్‌పీసీ సెక్షన్ 41-ఏ నోటీసు నిబంధనలను తప్పించుకోవడానికి పోలీసులు ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం) కేసు పెట్టి అరెస్ట్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఫిర్యాదిదారు సామాజిక స్థితి ఏమిటో పిటిషనర్‌కు తెలీదన్నారు. అలాంటప్పుడు కులం పేరుతో దూషించారనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. పిటిషనర్ నేరానికి పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవని, బెయిలు మంజూరు చేయాలని కోరారు. మంగళవారం వాదనలు పూర్తి కావడంతో తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి.. బుధవారం నిర్ణయాన్ని వెల్లడించారు.
BAIL TO DEVINENI: మాజీ మంత్రి దేవినేని ఉమాకు బెయిల్ మంజూరు - devineni uma
11:05 August 04
దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినప్పటికీ ఆయనకు కోర్టులో న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. బుధవారం కృష్ణా జిల్లా గొల్లపూడిలోని ఉమా నివాసంలో కుటుంబసభ్యులను వెంకన్న పరామర్శించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఉమాకు బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన నివాసం వద్ద కేకు కోశారు. తెదేపా నాయకులు కొమ్మారెడ్డి పట్టాభి, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.
సమాచారం లీక్ చేస్తున్నారని.. ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్