విజయవాడలో ప్రయాణికుల బ్యాగుల్లోంచి నగదు, బంగారం చోరీ చేసే నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.19 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఒకరి తర్వాత ఒకరు పథకం ప్రకారం బస్సులు ఎక్కుతారని.. ప్రయాణికుణ్ని ఏమార్చి బ్యాగులో నగదు దోచుకుంటారని విజయవాడ జాయింట్ సీపీ నాగేంద్రకుమార్ తెలిపారు. వరుస ఫిర్యాదులు అందడం వల్ల ప్రత్యేకంగా దృష్టి సారించి ముఠాను పట్టుకున్నామని వివరించారు.
ఏమారుస్తారు.. సంచుల్లో నగదు కొట్టేస్తారు..! - bag thefis at Vijayawada
ప్రయాణికుల్లా మనతోనే ఉంటారు... తోటి ప్రయాణికులను కంగారు పెడతారు. వాళ్ల హడావిడిలో వాళ్లు ఉంటే ... వీళ్లు చేతివాటం చూపిస్తారు. చోర కళలో ప్రావీణ్యం సంపాదించిన ఆ ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు.
![ఏమారుస్తారు.. సంచుల్లో నగదు కొట్టేస్తారు..! bag theifs arrested in Vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5364636-309-5364636-1576246362432.jpg)
విజయవాడలో బ్యాగ్ దొంగలు అరెస్ట్