పింఛన్ల రద్దును నిరసిస్తూ విజయవాడలో ఆందోళన - backward class fedaration members dharna for pensions
పింఛన్ల రద్దును నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ నాయకులు ఆందోళన చేశారు. వివిధ రకాల కారణాలు చెప్పి రేషన్‌కార్డులు, పింఛన్లు తొలగించటంపై ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తి మండిపడ్డారు. అర్హులైన వారందరికి పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.