కృష్ణా జిల్లా తిరువూరు మండలం ఎర్రమాడుకు చెందిన.. వేము రాము, వెంకటరమణ దంపతుల కుమార్తె మేరీ. కాన్పు నిమ్మితం భవాని హాస్పిటల్ కు వచ్చింది. అక్కడ మేరీ బిడ్డకు జన్మించింది. బిడ్డ ఉమ్మ నీరు తాగిందని సమీపంలోని సాయిరాం ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. పసిబిడ్డ అమ్మమ్మ బిడ్డను సాయిరాం హస్పిటల్ కు తీసుకువెళ్లింది. రోజుకు 5 వేలు ఖర్చు అవుతుందని..3 రోజుల పాటు పసిబిడ్డను ఐసీయూలో ఉంచి చికిత్స అందించాలని వైద్యులు తెలిపారు.
చెప్పినంత డబ్బులు కట్టాలని వైద్యం నిరాకరణ... శిశువు మృతి - baby death in tiruvuru news
ఆ మహిళ నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చింది. పురుడుపోసుకున్న ఆస్పత్రిలో బిడ్డ ఉమ్మనీరు తీసే సౌకర్యం లేక వేరే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు డబ్బులు కడితేగానీ చికిత్స అందించమని చెప్పి చికిత్స చేయలేదు. సమయం మించిపోయి బిడ్డ మృతి చెందింది.
![చెప్పినంత డబ్బులు కట్టాలని వైద్యం నిరాకరణ... శిశువు మృతి baby death in krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6992302-831-6992302-1588169286703.jpg)
baby death in krishna district
మందుల ఖర్చు అదనంగా అవుతుందని తెలిపారు. వారి వద్ద 13 వేలు ఉన్నాయని వాటితో బిడ్డకు చికిత్స అందించాలని ప్రాధేయపడ్డారు. వైద్యుడు కనికరించలేదు. ఫలితంగా నవజాత శిశువు చికిత్స అందక మరణించింది. నవమాసాలు మోసిన తల్లికి కడుపుకోత, తమకు గుండె కోత మిగిల్చారని బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ధనార్జనే లక్ష్యంగా ప్రాణాలు తీస్తున్న ఇలాంటి వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఎదుట బైఠాయించారు.
ఇవీ చదవండి:గుజరాత్ నుంచి స్వస్థలాలకు ఉత్తరాంధ్ర మత్స్యకారులు
Last Updated : Apr 30, 2020, 10:23 AM IST